
బర్త్ సర్టిఫికెట్ .. కష్టాలు అనేకం
జాతరో.. జాతర
● బర్త్ సర్టిఫికెట్ కోసం తప్పని తిప్పలు ● దండుకుంటున్న దళారులు ● అయినా పనికావడం లేదంటున్న బాధితులు
వేములవాడ: శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్నను 50 వేలకు పైగా భక్తులు
దర్శించుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్మగుండంలో స్నానాలు,
కల్యాణకట్టలో తలనీలాలు, నిలువెత్తు బెల్లం పంపిణీ, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల ద్వారా రూ.45లక్షల ఆదాయం సమకూరింది.
‘కొత్తపల్లికి చెందిన మల్లయ్య కూతురు లండన్‌లో విద్యనభ్యసిస్తోంది. ఆధార్‌లో ఒకలా, సర్టిఫికెట్లలో మరోలా పుట్టిన తేదీలు ఉండడం సమస్యగా మారింది. జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని కూతురు కోరడంతో రెవెన్యూ కార్యాలయంలో ఓ దళారీని ఆశ్రయించి రూ.5వేలు అప్పగించాడు. వారం రోజుల్లో ఇప్పిస్తానని చెప్పగా ఆరు నెలలవుతోంది’.
‘కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధంపూర్‌కు చెందిన స్వప్న 20ఏళ్లుగా బీడీలు చుడుతూ జీవనోపాధి పొందుతోంది. ఈపీఎ్‌ఫ్, ఆధార్ కార్డులో వేర్వేరుగా పుట్టిన తేదీలు నమోదయ్యాయి. ఆధార్‌లో ఉన్నట్లే ఈపీఎఫ్‌లో ఉండాలనేది నిబంధన. ఇందుకు జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవడం సమస్యగా మారింది. పుట్టింటి చిరునామాతో జనన ధ్రువీకరణ పత్రం జారీ అవుతోంది. దీంతో ఈపీఎఫ్‌లో ఉన్న చిరునామాకు సరిపోలడం లేదు’.
కరీంనగర్ అర్బన్: బర్త్ సర్టిఫికెట్ తలనొప్పిగా మారింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కొరవడటంతో ఇబ్బందులు తప్పడం లేదు. 50సంవత్సరాల క్రితం జన్మించిన వారికి పుట్టిన తేదీ తెలియదు. అప్పట్లో ఎవరైనా ఇంట్లో ఏదో ఒక చోట తేదీ, సమయం రాసి పెట్టి ఉంటే సరి. లేదంటే నెల, ఏడాది అటో ఇటో చెప్పి ధ్రువీకరణ పత్రాల్లో నమోదు చేయించుకున్నారు. ప్రస్తుతం గుర్తింపు, ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయడంతో అవస్థలు తప్పడం లేదు. ఆధార్, పాస్‌పోర్టు, పాన్‌కార్డులాగే జనన ధ్రువీకరణ పత్రం కీలకంగా మారుతోంది. విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు జనన పత్రం ఉంటేనే నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారుండగా చాలామంది ఉన్నత చదువులు చదువుతున్నారు. వారి తల్లిదండ్రులు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ తప్పనిసరి. వారికి జనన ధ్రువీకరణ పత్రం పొందాలంటే తిప్పలు తప్పడం లేదు. ఆధార్‌లో మార్పులు చేయాలంటే జనన ధ్రువీకరణ పత్రమే కీలకంగా మారింది.
బర్త్ సర్టిఫికెట్ పొందడమిలా..
జనన ధ్రువీకరణ పత్రానికి ముందుగా పంచాయతీ కార్యదర్శి/మునిసిపల్ ఇచ్చిన ఫాం– 10 ఆధారంగా నోటరీ తీసుకోవాలి. ఆ రెండింటితో పాటు మరో రెండు ఫాంలు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులతో ధ్రువీకరించుకోవాలి. మండలస్థాయి అధికారి (గెజిటెడ్) సంతకం అవసరం అవుతుంది. ఈ పత్రాలన్నీ జత చేసి మీసేవలో దరఖాస్తు చేయాలి, తహసీల్ కార్యాలయంలో అందజేస్తే అక్కడ పత్రాలను సరిచూసి ఆర్డీవో కార్యాలయానికి పంపుతారు. అక్కడినుంచి పత్రం జారీ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నిరక్షరాస్యులు దళారులను ఆశ్రయించి ఎంతో, కొంత చెల్లించి ఆర్థికంగా నష్టపోతున్నారు. అయినప్పటికీ పత్రాలు అందడం లేదని పలువురు వాపోతున్నారు.
దళారులను ఆశ్రయించొద్దు
జనన ధ్రువీకరణ పత్రం నిబంధనల మేరకు తీసుకోవాలి. దళారులను ఆశ్రయిస్తే తప్పులు చోటుచేసుకునే అవకాశముంది. మాయమాటలు చెప్పి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– కుందారపు మహేశ్వర్, ఆర్డీవో, కరీంనగర్