
ఆస్పత్రుల్లో మందుల కొరత లేదు
కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలాంటి మందుల కొరత లేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్‌నాయక్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉన్నాయా.. లేదా అనే అంశంపై పరిశీలించారు. అనంతరం సూపరింటెండెంట్, డీఎంహెచ్‌వో, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి పరిసరాల శుభ్రత తదితర విషయాలను తెలియజేయాలన్నారు. సిజేరియన్ ప్రసవాలు తగ్గించి, సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు. నాన్ కమ్యూనల్ డిసీజెస్ (ఎన్‌సీడీ)కు సంబంధించి, సీజనల్ వ్యాధుల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం నగరంలోని అపోలోరీచ్, పలు ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ, ఆర్‌ఎంవో డాక్టర్ నవీన, డీటీసీవో డాక్టర్ రవీందర్‌రెడ్డి, స్వామి, రాంనాథమ్, వైద్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్‌నాయక్