
భక్తజనసంద్రంగా సోమన్నగుట్ట
మల్లాపూర్: మల్లాపూర్‌లోని శ్రీకనకసోమేశ్వర స్వామివారి కొండ శ్రావణ రెండో సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొనేరులో పుణ్యస్నానం ఆచరించి స్వామివారికి ప్రీతిపాత్రమైన వరదపాశంను వండి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ సంగ గంగరాజం, వైస్ చైర్మన్ ఇల్లెందుల తుక్కారాం, ఆలయ ప్రధానార్చకులు బల్యపెల్లి ప్రభాకర్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

భక్తజనసంద్రంగా సోమన్నగుట్ట

భక్తజనసంద్రంగా సోమన్నగుట్ట