
కళారంగానికి మల్లయ్య సేవలు చిరస్మరణీయం
సిరిసిల్లటౌన్: కళారంగానికి మల్లయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొనియాడారు. సిరిసిల్ల టౌన్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన నాగుల మల్ల్లయ్య పురస్కార అవార్డుల ప్రదానోత్సవానికి హాజరై మాట్లాడారు. ఈ ప్రాంతం నుంచి నాగుల మల్లయ్య బీసీల కోసం పోరాడిన తొలితరం నాయకుడు అని కొనియాడారు. ఆయన పోరాట పటిమ బలహీనవర్గాలకు ఆదర్శనీయమన్నారు. గత 38 ఏళ్లుగా మల్లయ్య పేరిట వివిధ కళారంగాలకు వారికి పురస్కారాలు అందజేయడంపై కుటుంబ సభ్యులను అభినందించారు. చేనేతలో ఖండాంతరాల్లో ఖ్యాతి సంపాదిస్తున్న సిరిసిల్ల చేనేత శిల్పి వెల్ది హరిప్రసాద్‌ను శాలువాతో సన్మానించి అవార్డు ప్రదానం చేశారు. అవార్డు కమిటీ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కన్వీనర్లు ఎండీ సలీం, నాగుల సంతోష్‌గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బుర్ర నారాయణగౌడ్, ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
● వెల్ది హరిప్రసాద్‌కు నాగుల మల్లయ్య అవార్డు ప్రదానం