
ప్లకార్డులు.. నిరసనలు
● ప్రజావాణిలో గందరగోళం ● అధికారుల తీరుపై బాధితుల అసహనం
కరీంనగర్ అర్బన్: అధికారుల తీరును నిరసిస్తూ ప్రజావాణి నిరసనలకు వేదికై ంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయిలో చర్యలు కరవయ్యాయని ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేయగా మరికొందరు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో గందరగోళం నెలకొంది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు రావడం ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారిందే తప్ప సాంత్వన కరవైందని బాధితులు వాపోయారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేఽశ్వర్లు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. కాగా ప్రజావాణికి 290 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ పలకరించగా తమ ఆవేదనను వివరించారు..
ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు: 290
ఇందులో ఎక్కువగా
మునిసిపల్ కార్పొరేషన్: 46
సీపీ ఆఫీస్: 20
తహసీల్దార్ గంగాధర: 17
ఆర్డీవో కరీంనగర్: 15
కరీంనగర్‌రూరల్ తహసీల్దార్: 11
సైదాపూర్ తహసీల్దార్: 11
డీపీవో: 10
వారధి సొసైటీ: 09