
ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించాలి
కరీంనగర్‌క్రైం: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని న్యూ జెన్ఫోటెక్ సీఈవో కిశోర్ సూచించారు. సోమవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో కంప్యూటర్ విభాగం ఆధ్వర్యంలో శ్రీక్యాంపస్ టూ కార్పొరేట్ఙ్ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని న్యూ జెన్ఫోటెక్ సాఫ్ట్‌వేర్ సంస్థ సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, విద్యార్థినులు ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు, సాఫ్ట్‌వేర్ రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ఆధునిక టెక్నాలజీపై అవగాహన కల్పించారు. ఫ్యూచర్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల ప్రాధాన్యతను వివరించారు. నిరంతరం కొత్త ప్రోగ్రామ్స్, టూల్స్‌ను నేర్చుకొని కెరీర్‌లో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు టెక్నాలజీపై పట్టుసాధించాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి మాట్లాడుతూ, భవిష్యత్‌లో ఉద్యోగాల కోసం సన్నద్ధం అయ్యేందుకు ఇలాంటి అవగాహన సదస్సులు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ విభాగం ఇన్‌చార్జి డాక్టర్ ఎం.కల్పన, అధ్యాపకులు డి.శ్రీనివాస్, ఎం.హరికృష్ణ, బి.సుప్రియ, జె.కిషోర్, వి.సరిత, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.