
సమన్వయంతో నులిపురుగుల నివారణ
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్/కరీంనగర్‌టౌన్: జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని తెలిపారు. డీఈవో, డీఎంహెచ్‌వో, జిల్లా సంక్షేమ అధికారి, ఇంటర్మీడియట్ అధికారి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, బల్దియా కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు పాల్గొన్నారు.
స్వచ్ఛ పాఠశాల ర్యాంకింగ్‌కు..
కరీంనగర్‌అర్బన్: జిల్లాలో స్వచ్ఛత హరిత పాఠశాలల ర్యాంకింగ్, పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి యూనిసెఫ్ సహకారం అవసరమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో మాట్లాడారు. జిల్లాలో యూనిసెఫ్ సహకారంతో చేపట్టిన పారిశుధ్య కార్మికుల సంక్షేమ కార్యక్రమాల గురించి ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ వివరించినందున యూనిసెఫ్ బృందం సన్మానించింది.