
సర్టిఫికెట్ల పరిశీలన
కరీంనగర్: ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఆదివారం డీఈవో కార్యాలయంలో ఎస్‌జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం అర్హులైన వారి జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం వరకు జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న ఎస్‌జీటీలు తమ విద్యార్హతల ఒరిజినల్ ఽధ్రువపత్రాలు, సర్వీస్ రిజిస్టర్‌ను పరిశీలించారు. జాబితాలో దొర్లిన తప్పులను సవరించాలని కొంత మంది ఆధారాలతో సహా అర్జీలు పెట్టుకో, రానున్న జాబి తాలో ఆయా కేటగిరీల వివరాలను పొందుపర్చే అవకాశం ఇచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన రాత్రి వరకు కొనసాగింది. డీఈవో చైతన్య జైనీ దగ్గరుండి పర్యవేక్షించారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కార్యాలయం ఆవరణలో జాబితాపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేశారు.