
రోడ్డు ప్రమాదంలో గాయపడి.. మానసిక స్థితి కోల్పోయి..
గోదావరిఖని: స్థానిక జ్యోతినగర్‌కు చెందిన బండారి రాకేశ్(30) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో హోండా షోరూంలో మెకానిక్‌గా పనిచేసిన రాకేశ్.. ప్రస్తుతం ఏ పనీలేకుండా ఖాళీగా ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో మానకస్థితి కోల్పోయాడు. ఇదేక్రమంలో అతడి మేనమామ ఇటీవల మృతి చెందడంతో మానసికస్థితి మరింత క్షీణించింది. అలాగే చెల్లెకు ఎంగేజ్‌మెంట్ అయి క్యాన్సిల్ కావడంతో అది మనుసులో పెట్టుకుని మద్యానికి బానిసయ్యాడు. ఇదేక్రమంలో శనివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. మృతుడి తండ్రి భద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన వివరించారు. కాగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుడిని నేత్రాలు సేకరించి హైదరాబాద్ తరలించినట్లు ప్రతినిఽధి వాసు తెలిపారు.
రైల్వే పట్టాలపై చిక్కుకున్న కారు
కొడిమ్యాల: కొడిమ్యాల శివారు.. గంగాధర సమీపంలో ఉన్న రెల్వేగేట్ మధ్య ఓ కారు చిక్కుకుంది. రైలు వస్తుందన్న సమాచరంతో గేట్‌మెన్ సిగ్నల్ ఇచ్చి గేట్ క్లోజ్ చేస్తుండగా.. ఆ లోపే మరోవైపు ఉన్న గేట్ ద్వారా కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు డ్రైవర్ దూసుకొచ్చాడు. వెంటనే గేట్‌మెన్ అప్రమత్తమై సిగ్నల్ అందించి రైలును ఆపడంతో ప్రమాదం తప్పింది. తర్వాత గేట్లు తెరచి కారును బయటకు పంపించారు. లేకుంటే పెను ప్రమాదం సంభవించేంది.
గల్ఫ్ ఏజెంట్‌పై ఎస్పీకి ఫిర్యాదు
జగిత్యాలక్రైం: జగిత్యాలలో గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న ఓ ఏజెంట్ నిజామాబాద్ జిల్లా ఎండపల్లికి చెందిన ఐదుగురి నుంచి రూ.1.75లక్షల చొప్పున తీసుకున్నాడు. వారిని గల్ఫ్ పంపిస్తానని మోసం చేశాడు. దీంతో బాధితులు శనివారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన బాధితులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. సీఐ కరుణాకర్ గల్ఫ్ ఏజెంట్‌ను పిలిపించి సత్వరమే ఎవరి డబ్బులు వారికి చెల్లించాలని ఆదేశించారు. దశలవారీగా ఇస్తనని చెప్పడంతో బాధితులు అంగీకరించారు. సదరు ఏజెంట్ కొద్దిరోజులుగా జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎవరైనా కార్యాలయానికి వెళ్తే మహిళారిసెప్షన్‌లతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
● యువకుడి బలవన్మరణం

రోడ్డు ప్రమాదంలో గాయపడి.. మానసిక స్థితి కోల్పోయి..