
గంజాయి ముఠా అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్‌స్టేషన్ పరిధి పూడూరులో గంజాయి విక్రయిస్తున్న గుండుపాషా, బాలె నవీన్, జగిత్యాలలో ఆవునూరి రణదీర్, ఆకుల అమర్‌నాథ్, రాయారపు మల్లికార్జున్‌ను అరెస్ట్ చేసి వారి నుంచి 2.250 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కొడిమ్యాల మండలం పూడూరుకు చెందిన గుండు ప్రశాంత్, మల్యాల మండలం తాటిపల్లికి చెందిన బాలె నవీన్, గంగాధర మండలం వెంకటయ్యపల్లికి చెందిన వంశీ కొద్దికాలంగా నాగ్‌పూర్ ట్రైన్‌లో వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేసి చొప్పదండి, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. పూడూరులో విక్రయిస్తుండగా గుండు ప్రశాంత్, బాలె నవీన్‌ను పట్టుకోగా.. మరో నిందితుడు వంశీ పారిపోయాడు. జగిత్యాల శివారులోని లింగంపేటకు చెందిన రణదీర్, తులసీనగర్‌కు చెందిన అమర్‌నాథ్, రాయపు మల్లికార్జున్‌ను గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వంశీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. గంజాయి విక్రేతలను పట్టుకోవడంలో కృషిచేసిన పట్టణ సీఐ కరుణాకర్, మల్యాల సీఐ నీలం రవి, ఎస్సైలు సందీప్, రవికిరణ్‌ను డీఎస్పీ అభినందించారు.
ఐదుగురు నిందితుల పట్టివేత
2.250 కిలోల గంజాయి స్వాధీనం
డీఎస్పీ రఘుచందర్