
ట్రస్టుతో సేవా కార్యక్రమాలు
ఎలిగేడు(పెద్దపల్లి): మండలకేంద్రంలోని జెడ్పీ స్కూల్‌లో 1987–88లో పదో తరగతి పూర్తి చేసిన 100 మంది విద్యార్థులు సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో 2003 సెప్టెంబర్ 23న నానేస్తం ట్రస్టు ఏర్పాటు చేశారు. యువతకు కంప్యూటర్, డ్రైవిండ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థికసాయం, పేదలకు వైద్య ఖర్చులు, అనాథలకు ఆర్థికసాయం చేస్తున్నారు. ఎలిగేడులో వైకుంఠరథం, బాడీఫ్రీజర్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు దాదాపు రూ.50లక్షలకు పైగా ఖర్చు చేసి ఏడాదికి ఒకసారి అందరూ కలుసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అందరం స్పందిస్తాం
మా క్లాస్‌మేట్స్ వంద మంది కాగా ప్రస్తుతం 95మంది ఉన్నా రు. జరిగిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరం స్పందిస్తాం. ఏడాదికోసారి ట్రస్టు ఏర్పాటు చేసిన రోజు కలుసుకుంటూ యోగా క్షేమాలు తెలుసుకుంటాం. ట్రస్టు నిర్వహణపై చర్చించి ముందుకెళ్తాం.
– కట్ల సత్యనారాయణ, ట్రస్టు అధ్యక్షుడు

ట్రస్టుతో సేవా కార్యక్రమాలు