
బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం మొగిపాలెం శివా రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్‌లో నివసిస్తున్న చిగురుమామిడి మండలం రేకొండకు చెందిన మోరే రాజు(38), మామిడి కనకయ్య(55) శుక్రవారం బైక్‌పై రేకొండకు వెళ్లి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి కరీంనగర్ వెళ్తుండగా మొగిలిపాలెం వద్ద బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. కనకయ్య అక్కడిక్కడే మృతిచెందగా, రాజు తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో రాజును కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనకయ్య చిన్నాన్న ఐదురోజుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.