
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
గొల్లపల్లి: మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని తునికి శ్రీనివాస్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాములపల్లికి చెందిన తునికి శ్రీనివాస్ జగిత్యాల వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెంగళాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన విధులు ముగించుకొని ఇంటికి వచ్చాక వెంగళాపూర్ ఎక్స్‌రోడ్డుకు సమీపంలో చిరువ్యాపారం నిర్వహిస్తున్న తన తల్లి వద్దకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.