కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Aug 2 2025 6:38 AM | Updated on Aug 2 2025 6:38 AM

కట్నం

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

రాజన్నకు మొక్కులు

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌ ఔట్‌ గేట్‌ వద్ద శుక్రవారం బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారు. రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన దావు రాజయ్య(65) కరీంనగర్‌లో కూలీ పనిచేస్తున్నాడు. భార్య, పిల్లలకు దూరంగా ఉంటూ బస్టాండ్‌లో ఉంటున్నాడు. బస్టాండ్‌ ఔట్‌ గేటు వద్ద రోడ్డు దాటుతుండగా జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ గాంధీపై కేసు నమోదు చేసినట్లు వన్‌ టౌన్‌ సీఐ కోటేశ్వర్‌ తెలిపారు.

మానకొండూర్‌: కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మానకొండూర్‌ మండలం గంగిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి తల్లి కొయ్యడ సమ్మక్క వివరాల ప్రకారం.. గంగిపల్లికి చెందిన చలిగంటి నాగయ్యతో మెట్‌పల్లికి చెందిన హేమలతకు ఐదేళ్లక్రితం వివాహమైంది. భర్త, అత్త, ఇద్దరు ఆడబిడ్డలు అదనపు కట్నం తేవాలని వేధించారు. దీంతో తల్లిగారింటికి వెళ్లింది. కుమారుడు జన్మించడంతో ఐదు నెలల తరువాత అత్తగారింటికి వచ్చింది. మరోసారి డబ్బులు తేవాలంటూ వేధించడంతో ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సంజీవ్‌ తెలిపారు.

ఉరేసుకుని ఒకరు..

చొప్పదండి: పట్టణంలోని బీసీకాలనీలో నివాసముండే దండే పరందాములు (43) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టైలరింగ్‌ పనిచేసే పరందాములు కొద్దికాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి టైలర్‌షాప్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దండె కవిత ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన దుర్శెట్టి రాకేశ్‌ (32) పురుగుల మందు తాగి శుక్రవారం మరణించాడు. మూడేళ్లక్రితం రాకేశ్‌ మానసిక స్థితిసరిగ్గా లేదని భార్య తన కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. భార్య రావడం లేదని రాకేశ్‌ మరింత మనస్తాపానికి గురై క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నగేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై మల్లేశ్‌తెలిపారు.

శతాధిక వృద్ధురాలు మృతి

రాయికల్‌: రాయికల్‌ మండలం రామారావుపల్లికి చెందిన దయ్యాల రాజు (120) అనే శతాధిక వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందింది. రాజుకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఉరేసుకొని వృద్ధుడి ఆత్మహత్య

మల్యాల: మండలంలోని నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌కాలనీకి చెందిన భీనవేని భాగయ్య (69) శుక్రవారం అనారోగ్యంతో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డినట్లు మల్యాల ఎస్సై నరేశ్‌కుమార్‌ తెలిపారు. భాగయ్య భార్య పదేళ్ల క్రితం మృతి చెందగా.. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతూ అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన తన ఇంటి ఎదుట ఉన్న మామిడితోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రౌడీషీటర్‌ మనోజ్‌పై పీడీయాక్ట్‌

సిరిసిల్లక్రైం: భూ వివాదంలో బొల్లు మల్లవ్వ అనే మహిళను రెండు నెలల క్రితం హత్య చేసిన కేసులో చందుర్తి మండలానికి చెందిన రౌడీషీటర్‌ మనోజ్‌పై పీడీయాక్ట్‌ నమోదు చేసినట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. ఈమేరకు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చర్లపల్లి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. మనోజ్‌ 2023లో హత్య, దొంగతనం, బెదిరింపుకు పాల్పడిన కేసులలో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న యువకుడిపై 2024లో రౌడీషీట్‌ తెరిచినట్లు తెలిపారు. కౌన్సెలింగ్‌ నిర్వహించినా ప్రవర్తనలో మార్పు రాకపోగా.. తరచూ నేరాలకు పాల్పడుతుండడంతో పీడీయాక్ట్‌ అమలు చేసి, చర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలిపారు.

హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు

వేములవాడఅర్బన్‌: హత్యాయత్నం కేసులో ఇద్దరికీ ఐదేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ అసిస్టెంట్‌ సెషన్‌ కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్‌ జాదవ్‌ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ తెలిపారు. బోయినపల్లికి చెందిన అలువాల శ్రీనివాస్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా భార్య పురుగుల మందు తాగి మృతిచెందింది. ఆమె మృతికి భర్త శ్రీనివాస్‌, కుటుంబ సభ్యులు కారణమని భార్య తండ్రి భూపతి మల్లయ్య, అన్న విజయ్‌ చింతాల్‌ఠాణా గ్రామస్తులు.. శ్రీనివాస్‌తోపాటు అతని స్నేహిడుతు మోహన్‌పై దాడి చేశారు. బాధితుడి శ్రీనివాస్‌ ఫిర్యాదుతో 2023, ఫిబ్రవరి 17న వేములవాడ అప్పటి ఎస్సై ఎండీ రఫీక్‌ఖాన్‌, వేములవాడ టౌన్‌ సీఐ వెంకటేశ్‌ కేసు నమోదు చేశారు. భూపతి మల్లయ్య, విజయ్‌కు ఐదేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు తెలిపారు.

గతంలో దరఖాస్తులు స్వీకరించి నిలిపివేత

ఈ నెల 5నుంచి మళ్లీ స్వీకరణ

ఉమ్మడి జిల్లాకు రూ.10.4కోట్ల కేటాయింపు

ఉమ్మడి జిల్లాకు కేటాయించిన నిధులు: రూ.10.4 కోట్లు

కొనుగోలు చేయనున్న పరికరాల సంఖ్య: 13,140

ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు: 50 శాతం రాయితీ

ఇతరులకు: 40 శాతం రాయితీ

దరఖాస్తుల స్వీకరణ:

ఈ నెల 5నుంచి 15వరకు

ఉమ్మడి జిల్లాకు ఏయే పరికరాలు ఎన్నెన్ని ఇవ్వనున్నారంటే

బ్యాటరీ స్ప్రేయర్స్‌ :9,579

పవర్‌ స్ప్రేయర్స్‌ :1,761

రోటవేటర్‌ : 564

సీడ్‌ కమ్‌ ఫర్టిలైజర్‌ డ్రిల్‌: 110

కల్టివేటర్‌ : 651

బండ్‌ ఫార్మర్‌ : 30

పవర్‌ వీడర్‌ : 59

బ్రష్‌ కట్టర్‌ : 132

పవర్‌ టిల్లర్‌ : 84

స్ట్రా బాలర్స్‌ : 170

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య1
1/5

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య2
2/5

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య3
3/5

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య4
4/5

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య5
5/5

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement