
ప్రాణం తీసిన నిద్రమత్తు
● డ్రైవర్ మృతి
● మరొకరికి తీవ్రగాయాలు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): శాసీ్త్రనగర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున అగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో రాజస్తాన్‌కు చెందిన డ్రైవర్ శౌకిన్(40) మృతి చెందాడు. మరో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. కొత్తగూడెం నుంచి మిర్చిలోడ్‌తో ఢిల్లీకి వెళ్తన్న లారీ సుల్తానాబాద్‌కు చేరుకుంది. అయితే, నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. రోడ్డు పక్కన అగిఉన్న మరోలారీని వెనుకనంచి ఢీకొట్టాడు. దీంతో డ్రైవింగ్ చేస్తున్న మహబూబ్‌కు తీవ్రగాయాలయ్యాయి. మరో డ్రైవర్ శౌకిన్ క్యాబిన్‌లో పడుకొని ఉండగా అక్కడికక్కడే మృతి చెందాడు. హరియాణాకు చెందిన వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేశారు.
క్వారీ సూపర్‌వైజర్ మృతి
సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగీర్‌పల్లిలోని శ్రీలక్ష్మీ గ్రానైట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న దీకొండ రాజు(43) ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తికి చెందిన దీకొండ రాజు జాగీర్‌పల్లిలోని శ్రీలక్ష్మీ గ్రానైట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం గ్రానైట్ బండను యంత్రంతో జరుపుతున్న క్రమంలో ఒక బండరాయి రాజు కుడికంతకు బలంగా తగిలింది. కంత, తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజుకు భార్య సంతోష్‌కుమారి, కూతురు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
విద్యుత్‌షాక్‌తో ఎద్దు మృతి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ శివారు గోపాల్‌పూర్‌లో శుక్రవారం రైతు అనుముల అంజయ్యకు చెందిన ఎద్దు విద్యుత్‌షాక్‌తో మృతిచెందగా రైతుకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. దాడి నర్సయ్యకు చెందిన పొలంలో అనుముల అంజయ్య ఎద్దులతో గొర్రు కొట్టేందుకు కిరాయికి వెళ్లాడు. గొర్రు కొడుతున్న క్రమంలో పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం సపోర్టువైరుకు ఎద్దు తాకడంతో విద్యుత్‌షాక్‌తో మృతిచెందింది. అప్రమత్తమైన అంజయ్య పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎన్‌పీడీసీఎల్ రూరల్ ఏడీఈ రఘు, ఏఈ అనిల్, బొమ్మకల్ పశువైద్యాధికారి జ్యోత్స్న పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును బాధిత రైతును అడిగి తెలుసుకున్నారు. ఎద్దు విలువ సుమారు రూ.60వేల వరకు ఉంటుందని అంజయ్య తెలిపాడు. ప్రభుత్వం నష్టపరి హారం మంజూరు చేసి ఆదుకోవాలని కోరాడు.

ప్రాణం తీసిన నిద్రమత్తు

ప్రాణం తీసిన నిద్రమత్తు