
నాన్న కార్నియా దానం చేశాం
మా నాన్న శౌరయ్య అనారోగ్యంతో గత జూన్ 3న మృతి చెందాడు. బంధువులు వారిస్తున్నా శ్మశాన వాటికలో పార్థివదేహాన్ని ఖననం చేయకుండా అర్ధగంట ఆపాం. సదాశయ ఫౌండేషన్ అవగాహన కల్పించగా, కుటుంబ సభ్యులను ఒప్పించా. టెక్నీషియన్‌ను శ్మశానవాటికకే రప్పించి నేత్రాలు దానం చేయించా.
– విజయ్‌కుమార్,
గోదావరిఖని
ముగ్గురికి పునర్జన్మ
మా నాన్న రామకృష్ణ బీపీ పెరి ఇంట్లో పడియాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాం. అక్కడ చికిత్స పొందుతూ గత జూన్ 29న బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఆయన అవయవాలను దానం చేస్తే పలువురికి పునర్జన్మ కల్పించవచ్చని జీవన్‌ధాన్ కో ఆర్డినేటర్లు కౌన్సెలింగ్ ఇవ్వడంతో కాలేయాన్ని ఒకరికి, మూత్రపిండాలను మరోఇద్దరికి దానం చేశాం. దీంతో మా నాన్న అవయవాలు వారికి పునర్జన్మ నిచ్చాయి. – తుమ్మ ప్రణయ్, గోదావరిఖని
అవగాహన పెరుగుతోంది
అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. సదాశయ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 1,511 వరకు నేత్రదానాలు, 90 వరకు అవయవదానాలు, 151 వరకు దేహదానాలు జరిగాయి. 1,600 వరకు అవయవదానాలపై అవగాహన సదస్సులు నిర్వహించాం. సుమారు 50,000లకు పైగా మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానాలకు ప్రజలు స్వచ్ఛందంగా అంగీకారం తెలిపారు.
– సీహెచ్ లింగమూర్తి, జాతీయ ప్రధాన
కార్యదర్శి, సదాశయ ఫౌండేషన్

నాన్న కార్నియా దానం చేశాం

నాన్న కార్నియా దానం చేశాం