
గుండెపోటుతో కార్మికుడి మృతి
● నేత్రదానం చేసిన కుటుంబసభ్యులు
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికుడు నారిశెట్టి శ్రీకాంత్(39) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయం విధులకు హాజరైన కార్మికుడు.. అస్వస్థతగా ఉందని తోటి కార్మికులకు చెప్పాడు. ఆ వెంటనే అంబులెన్స్‌లో పీటీఎస్‌లోని ధన్వంతరి ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స అందించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య అనూష, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్.. డీఎం ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. అయితే, పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్య అనూష, కుటుంబసభ్యులు శ్రీకాంత్ నేత్రాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా, శ్రీకాంత్ మృతి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు.. డీఎం ప్లాంట్ కాంట్రాక్ట, కార్మిక సంఘాల నాయకులు, కాంట్రాక్టర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం శ్రీకాంత్ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం, ఇద్దరికి ఉద్యోగావకాశం కల్పించేందుకు, అంత్యక్రియలకు రూ.50వేలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టర్ రాజ్‌కుమార్, యూనియన్ల ప్రతినిధులు కౌశిక హరి, భూమల్ల చందర్, చిలుక శంకర్, నాంసాని శంకర్, కాంట్రాక్టర్లు ఏబీసీ రెడ్డి, ఎలిని నారాయణ, వెంకటేశ్వరరావు, రాజాకిషన్, రాజేశం, సోమిరెడ్డి ఉన్నారు.