
విజయవంతంగా అమలు చేశాం
పెద్దపల్లి జిల్లాలో ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టంను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు కలెక్టర్ ఆదేశాలతో శ్రీకారం చుట్టాం. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని సామరస్యంగా సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్లాం. 11నెలల కాలంలో 85 నుంచి 95 శాతం సమయపాలన సాధించేలా చర్యలు తీసుకున్న కలెక్టర్ శ్రీహర్ష రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు.
– మల్లేశ్, ఎఫ్‌ఆర్‌ఎస్ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్
ఉపాధ్యాయుల పాత్రకీలకం
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పాత్ర కీలకం. వారంతా సమయపాలన పాటిస్తూ నిబద్దత, అంకితభావంతో భావిభారత పౌరులను క్రమశిక్షణ, పట్టుదలతో చదివేలా ప్రోత్సహించి ఉన్నతంగా ఎదిగేలా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. ఇందుకోసం జిల్లాలో చేపట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టం కు అనుగుణంగా టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ విధులు నిర్వర్తిస్తూ జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేశారు. – కోయ శ్రీహర్ష, కలెక్టర్, పెద్దపల్లి

విజయవంతంగా అమలు చేశాం