
కొండగట్టులో ముగిసిన సప్తాహం
మల్యాల: శ్రావణమాసం సందర్భంగా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో వారం రోజు లుగా నిర్వహిస్తున్న శ్రావణ సప్తాహం ఉత్సవాలు గురువారం ముగిశాయి. చివరిరోజు స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీవేంకటేశ్వర స్వామివారికి సేవ నిర్వహించారు. ఆలయంలో సహస్ర దీపాలంకరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సునీల్‌కుమార్, హరిహరనాథ్, ఆలయ పర్యవేక్షకులు ఉమా మహేశ్వర్, ఆలయ ప్రధాన అర్చకులు వకుళాభరణం రఘు, ఉప ప్రధాన అర్చకులు తిరుకోవెల మారుతి ప్రసాద్, తిరునగరి రాంచంద్ర ప్రసాద్, ముఖ్య అర్చకులు, అర్చకులు పాల్గొన్నారు.

కొండగట్టులో ముగిసిన సప్తాహం