
బడిలో పాఠాలు.. పొలంలో వరినాట్లు
గంగాధర: విద్యార్థులకు తరగతి గదుల్లో చదువుతో పాటు పంటలసాగుపై అవగాహన కల్పించడానికి గంగాధర మండలం ఒద్యారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులను రైతులు సాగు చేస్తున్న పొలాల వద్దకు తీసుకెళ్లి వరినాట్లు వేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థులను క్షేత్రస్థాయిలోకి వ్యవసాయ పనుల్లో భాగస్వామ్యులను చేయడం ద్వారా సాగుపై ఆసక్తి పెరుగుతుందన్నారు. పంటలు, ఎరువుల రకాలు, నేల స్వభావంతో పాటు, ఏ పంట ఎంతకాలంలో దిగుబడి వస్తుందో తెలుస్తుందన్నారు. విద్యార్థులు రైతులు పండించే పంటల గురించి అడిగి తెలుసుకున్నారు.