
మాదకద్రవ్యాల నివారణకు చర్యలు
● నేర సమీక్షలో సీపీ గౌస్‌ఆలం
కరీంనగర్‌క్రైం: మాదకద్రవ్యాల వాడకాన్ని కట్టడి చేస్తున్నామని, వీటి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్ కమిషనరేట్‌లో నేర సమీక్ష నిర్వహించారు. రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పోలీస్ అధికారుల వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. డివిజన్‌ను సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌కి ఏఎస్సై లేదా హెడ్ కానిస్టేబుల్‌ను ఇన్‌చార్జిగా నియమించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే తగిన కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. పలు కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేసినందుకు జిల్లాలోని అన్నికోర్టుల్లో పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ ఘనంగా సన్మానించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ(పరిపాలన), భీం రావు(ఏఆర్), ఏసీపీలు శ్రీనివాస్, విజయకుమార్, వేణుగోపాల్, శ్రీనివాస్‌జీ, సతీశ్, వెంకటస్వామి, డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ప్రాసిక్యూషన్ డి.శరత్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె.శ్రీరాములు, అడిషనల్ పీపీలు పాల్గొన్నారు.