
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
వెల్గటూర్: పరీక్షల్లో తరచూ ఫెయిల్ అవుతున్నాననే మనోవేదనతో ఓ యువకుడు ఉరేసుకున్న ఘటన మండలంలోని పైడిపెల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కూన రఘు (22) కరీంనగర్‌లో ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. డిగ్రీలో మూడు సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. పలుసార్లు రాసినా పాస్ కావడంలేదు. మనోవేదనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి తండ్రి మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.