
వీధికుక్కల దాడిలో 200 నాటు కోళ్లు మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల గ్రామంలో వీధికుక్కలు దాడి చేయడంతో 200 నాటు కోళ్లు మృతిచెందాయి. పిట్ల నర్సింలుకు చెందిన కోళ్ల షెడ్‌లోకి కుక్కల గుంపు చేరి కోళ్లను చంపాయి. తనకు సుమారు రూ.1.50లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
గంజాయి ముఠా అరెస్టు
కరీంనగర్‌రూరల్: గంజాయి విక్రయిస్తున్న ముఠాను మంగళవారం అరెస్టు చేశారు. పట్టుబడిన నలుగురులో ఓ మైనర్ ఉన్నాడు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఎస్సై లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాజీవ్ రహదారిలోని ఇరుకుల్ల వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తున్న నలుగురు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పట్టుకున్నారు. వారివద్ద 2.30 కిలోల లభించింది. పట్టుబడిన వారిలో మొగ్ధుంపూర్‌కు చెందిన బుర్ర వంశీ(22), దుర్గం హరికృష్ణ(22), సుల్తానాబాద్ మండలం పూసాలకు చెందిన సాయి(21)తోపాటు ఓ బాలుడి ఉన్నాడని, వారినుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రెండు మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

వీధికుక్కల దాడిలో 200 నాటు కోళ్లు మృతి