
ప్రజావాణికి వినతుల వెల్లువ
కరీంనగర్‌అర్బన్: కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి వినతుల తాకిడి ఎక్కువవుతోంది. ప్రతీ సోమవారం సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాల కోసం అర్జీలు అందజేశారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేశ్ దరఖాస్తులు స్వీకరించారు. పలు దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవచూపారు. మొత్తం 328 దరఖా స్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ‘సాక్షి’కి వివరించారు. వారి మాటల్లోనే..