
తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ, బాబు
● కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణపై ప్రధాని మోదీ, ఎపీ సీఎం చంద్రబాబు విషం చిమ్ముతూ ఎడారి చేసే ప్రయత్నం చేస్తున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. రేకుర్తిలోని స్వయంభూ శంఖు చక్రధార శ్రీలక్ష్మీనరసింహస్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ, రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తున్నాయన్నారు. బీజేపీ మెడలు వంచాలంటే ఢిల్లీలో తిష్ట వేసి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సాధించుకోవాలని పేర్కొన్నారు. కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తమని, టీఆర్‌ఎస్ పుట్టింది తెలంగాణ కోసమేనని, ఎందులో విలీనం కాదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే శంఖుచక్రాలతో వెలసిన ఏకై క స్వయంభూ ఆలయాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రూ.25 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం బాధాకరమని, మరో రూ.5 కోట్లు కేటాయిస్తే ఆలయ నిర్మాణం పూర్తయి భక్తులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, కాసారపు శ్రీనివాస్‌గౌడ్, సుధగోని మాధవి కృష్ణగౌడ్, ఎదుల రాజశేఖర్, కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, చందు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.