
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కండి
కొత్తపల్లి(కరీంనగర్)/తిమ్మాపూర్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కొత్తపల్లి మండలం కమాన్‌పూర్, తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, మోదీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఎంపీ ఎన్నికల్లో తిమ్మాపూర్ మండలం నుంచి అత్యధిక ఓట్లతో ప్రజలు బండి సంజయ్‌కు భారీ మెజార్టీ అందించారని గుర్తుచేశారు. హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కొత్తపల్లి, తిమ్మాపూర్ మండలాల అధ్యక్షులు తిరుపతి, సుగుర్తి జగదీశ్వరాచారి, రతన్‌కుమార్, అనిల్‌కుమార్, నాగేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కొమురయ్య, శ్రీనివాస్, చింతం శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, రాజుయాదవ్, రవీందర్‌యాదవ్, గడ్డం అరుణ్, బండి సాగర్, దుర్సెట్టి రమేశ్, కొయ్యడ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.