
ముస్లింల పేరుతో రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర
కరీంనగర్‌కార్పొరేషన్: ముస్లింల నెపంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అడ్డుకునేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని సుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. ఓసీ అయినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి బీసీల పట్ల చిత్తశుద్ధితో 42 శాతం రిజర్వేషన్ అమలుకు పూనుకున్నారని తెలిపారు. కానీ, పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెట్టలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సంజయ్ నాటకాలు మొదలు పెట్టారన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడం బీజేపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కేవలం వార్తల్లో ఉండేందుకే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సీఎంపై చవకబారు ఆరోపణలు చేస్తున్నారని, ఇలాగే వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. కొరివి అరుణ్‌కుమార్, బానోతు శ్రవణ్‌నాయక్, సమద్‌నవాబ్, దండి రవీందర్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, మహమ్మద్ అమీర్, కీర్తి కుమార్, పెద్దిగారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.