
మాతృమూర్తుల కళ్లు సజీవం
సుల్తానాబాద్/కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్ మండలాలకు చెందిన ఇద్దరు మాతృమూర్తులు చనిపోతూ మరికొందరికి చూపునిచ్చారు. వివరాలు.. సుల్తానాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన భీమవరపు సుందరమ్మ(86) వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో సోమవారం ఇంట్లోనే చనిపోయింది. ఆమె భర్త మురహరిరావు స్వాతంత్య్ర సమరయోధుడు. అయితే, సుందరమ్మ నేత్రాలు దానం చేస్తే మరో ఇద్దరికి చూపువస్తుందని సదాశయ ఫౌండేషన్ ముఖ్య సలహాదారు నూక రమేశ్.. ఆమె కుటుంబసభ్యులను ఒప్పించారు. దీంతో ఆ మాతృమూర్తి కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అళ్లుళ్లు ఇందుకు అంగీకరించారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్‌నాయక్ సహకారంతో కార్నియాలు సేకరించారు. ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, నూక రమే శ్, భీష్మాచారి, కేఎస్ వాసు తదితరులు కుటుంబసభ్యులను అభినందించారు.
మాజీ ఎంపీపీ రాజమ్మ కళ్లు దానం..
కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన మాజీ ఎంపీపీ ఈద రాజమ్మ(65) ఆది వారం రాత్రి చనిపోయారు. దీంతో సదాశివ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్ ఆమె కుటుంబ సభ్యులను కలిసి కళ్లు దానం చేయాలని విన్నవించారు. దీంతో వారు అంగీకరించగా, టెక్నీషియన్ ఆమె కార్నియాలు సేకరించారు. మృతురాలు భర్త, మాజీ సర్పంచ్ ఈద సత్యనారాయణరెడ్డి, కుమారుడు రఘోత్తంరెడ్డి, కూతురు మాధవి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ ఎంపీపీ బాలే మల్లేశ్వరి, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
చనిపోతూ మరికొందరికి చూపునిచ్చిన ఇద్దరు మహిళలు

మాతృమూర్తుల కళ్లు సజీవం

మాతృమూర్తుల కళ్లు సజీవం