
ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ అర్బన్: ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ ఐదేళ్ల క్రితం కరీంనగర్ కలెక్టర్‌గా వ్యవహరించగా అంతకుముందు ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు ప్రత్యేక అధికారిగా వ్యవహరించనుండగా విపత్తులు, ప్రత్యేక పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరును పర్యవేక్షించనున్నారు. కొన్ని నెలల క్రితం వరకు ఆర్వీ కర్ణన్ జిల్లా ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.