
చొప్పదండి పీఏసీఎస్‌కు బెస్ట్ ఫర్ఫార్మింగ్ అవార్డు
చొప్పదండి: నాబార్డ్ 44వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డులలో చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బెస్ట్ ఫర్ఫార్మింగ్ అవార్డును సొంతం చేసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా పీఏసీఎస్ చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, సీఈవో కళ్ళెం తిరుపతిరెడ్డి అవార్డు అందుకోనున్నారు. పాలకవర్గం సమష్టి నిర్ణయాలు తీసుకొని సమయానుకూలంగా సభ్యులకు సేవలు అందిస్తూ, అమలుపరచడంలో వంద శాతం పనితీరు కనబరుచడంతో చొప్పదండి పీఏసీఎస్‌కు వరుసగా అవార్డులు వస్తున్నాయి. ఇప్పటికే జాతీయస్థాయి ఉత్తమ పీఏసీఎస్ అవార్డు రాగా, దేశవ్యాప్తంగా ఉన్న 96 వేల సంఘాలలో చొప్పదండి పీఏసీఎస్ హైట్రిక్ అవార్డు అందుకుంది. చైర్మన్‌గా మల్లారెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడుసార్లు జాతీయ ఉత్తమ పీఏసీఎస్ అవార్డు అందుకోవడం గమనార్హం. తిరుపతిరెడ్డి కూడా పలుమార్లు ఉత్తమ సీఈవోగా అవార్డులు అందుకున్నారు. అవార్డు అందుకుంటున్న సందర్భంగా పాలకవర్గం, సిబ్బందిని జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంకు సీఈవో సత్యనారాయణరావు అభినందించారు.
రైల్వేస్టేషన్ అభివృద్ధికి కేంద్రం కృషి
జమ్మికుంట(హుజూరాబాద్): ప్రయాణికులు, సరుకుల రవాణాకు జమ్మికుంట రైల్వేస్టేషన్ ఎంతో కీలకమని, స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్టేషన్‌ను సందర్శించి ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వేస్టేషన్‌ను మరింత అభివృద్ధి చేయించేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ లక్ష్యంతో ఉన్నారని, అమృత్ భారత్‌లో భాగంగా ఆధునీకరించడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కొత్తపల్లి వరకు పొడిగించడం, లిఫ్ట్ సౌకర్యం, హైలెవల్ ప్లాట్‌ఫాం నిర్మాణం, ముఖ్యమైన రైళ్ల హాల్టింగ్ ఉండేలా కేంద్ర మంత్రి చర్యలు తీసుకున్నారని వివరించారు. కార్యక్రమంలో జమ్మికుంట, హుజూ రాబాద్ పట్టణాల అధ్యక్షులు కొలకాని రాజు, తూర్పాటి రాజు, మాడ వెంకట్‌రెడ్డి, ఆకుల రాజేందర్, జీడి మల్లేశ్, శీలం శ్రీనివాస్, రమారెడ్డి, రాజేశ్‌ఠాకూర్, గణేశ్, అశోక్, బచ్చు శివన్న, మోతే స్వామి, నగేశ్, నిరుపరాణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర జల శక్తి బృందం తనిఖీ
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం ఇరుకుల్లలో కేంద్ర జల శక్తి అభియాన్ కింద చేపట్టిన పనులను సోమవారం జల శక్తి బృందం తనిఖీ చేసింది. గ్రామంలో నిర్మించిన ఇంకుడుగుంతలను జిల్లా నోడల్ అధికారి డి.చైతన్య, కో ఆర్డినేటర్ శ్రీధర్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో శోభరాణితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
‘బహుజనగణమన’ పుస్తకం ఆవిష్కరణ
కరీంనగర్ కల్చరల్: తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ సామాజిక పుస్తకాన్ని సోమవారం కరీంనగర్‌లోని జయశంకర్ విగ్రహం వద్ద బీసీ సంఘం నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు ఉల్లంగుల ఏకానందం, రాచకొండ సత్యనారాయణ, గుంజపడుగు హరిప్రసాద్, కలర్ సత్తన్న, మెతుకు సత్యం, తిప్పారపు శ్రీనివాస్, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చొప్పదండి పీఏసీఎస్‌కు బెస్ట్ ఫర్ఫార్మింగ్ అవార్డు

చొప్పదండి పీఏసీఎస్‌కు బెస్ట్ ఫర్ఫార్మింగ్ అవార్డు