
అమ్మా తినవే.. కలెక్టరమ్మ న్యాయం చేస్తది..
‘ఈ వృద్ధురాలి పేరు ఎలిగేటి రుక్కవ్వ, వయసు 80. మలివయసులో తోడుగా ఉండాల్సిన కొడుకులు నిర్దయగా వ్యవహరించడంతో ఇదిగో ఇలా కూతురు లక్ష్మి సాయంతో కలెక్టరేట్‌కు వచ్చింది. ఉదయమే కలెక్టరేట్‌కు సద్దన్నంతో వచ్చారు. సమయం 12 కావడంతో వృద్ధురాలికి ఆకలి వేయగా కలెక్టరేట్ పొడియం వద్ద తినిపించింది. అయితే కలెక్టరమ్మను కలిసిన తరువాతే తింటానని మారాం చేయగా ‘కలెక్టరమ్మ న్యాయం చేస్తది తినవే’ అంటూ బతిమిలాడుతూ తినిపించింది. చొప్పదండి మండలం రాగంపేటలో తన పేరిట రెండు ఇళ్లు, భూమి ఉండగా, పెద్ద కొడుకు అక్రమంగా తన పేరున మార్చుకుంటున్నాడని వాపోయింది. ఆలనా పాలన చూసుకోవాల్సిందిపోయి పట్టించుకోవడం లేదని రోదించింది’.