
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
కరీంనగర్‌అర్బన్: ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతు వంటి అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీ క్షలో మాట్లాడారు. పాఠశాలలు, ప్రభుత్వ భవనా ల్లో మౌలిక వసతుల కల్పన, కిచెన్‌షెడ్, టాయిలెట్, ప్రహరీ వంటివి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో ప్రతీ పనిని పర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న పలు ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్లలో మరమ్మతులు చేపడుతున్నామని, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, జిల్లా సంక్షేమ అధికారి పనులను పర్యవేక్షిస్తూ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఆయిల్‌పాం సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. ప్రైవేట్ అంబులెన్స్‌లను ప్రభుత్వ ఆసుపత్రులకు అతి సమీపంలో నిలుపుతున్నారని, ఈ విధానాన్ని కట్టడి చేయాలన్నారు. ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని ప్రత్యేక ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి