
చేప పిల్లల ఉత్పత్తిపై అవగాహన కల్పించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియను జీవశాస్త్రం చదివే విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మానేరు జలాశయం సమీపంలో నిర్వహిస్తున్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. తల్లి చాప నుంచి గుడ్ల ఉత్పత్తి మొదలుకొని వాటిని రైతులకు అందజేసే ప్రక్రియను మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయభారతి కలెక్టర్‌కు వివరించారు. జీవశాస్త్రం చదువుతున్న విద్యార్థులకు చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.