
జ్యోతిష్మతిలో ఎంపవరింగ్ ఇన్నోవేటర్స్
తిమ్మాపూర్: మండలంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఆవిష్కరణ, వ్యవస్థాపకత, స్టార్టప్ అభివృద్ధిని పెంపొందించడానికి ఎంపవరింగ్ ఇన్నోవేటర్స్–ఏ గైడ్ టు ఎంటర్ ప్రైన్యూషిప్ అనే అంశంపై ఒక సెషన్ నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ జవ్వాడి సాగర్‌రావు తెలిపారు. నిర్మాణాత్మక ఇంక్యుబేషన్ మద్దతు ద్వారా స్వయం సమద్ధి, ఆర్థిక సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖతో అనుసంధానించబడిన సంస్థాగత చొరవలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సెక్రటరీ, కార్యదర్శి జె.సుమిత్‌సాయి తెలిపారు. భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ కె.సి.చౌదరి మాట్లాడుతూ.. విద్యార్థులకు విలువైన సందేశాలు అందించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ జయలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.అనిల్‌కుమార్, డీన్ అకాడమిక్స్ అండ్ ఆడిట్ డాక్టర్ పీకే వైశాలి, విభాగాధిపతి డాక్టర్ ఆర్.జగదీషన్, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు డా.పి.ప్రణీత, జి.సింధుష తదితరులు పాల్గొన్నారు.