
పత్తి కొనుగోళ్లలో కొత్త విధానం
పీబీపీఎస్ జమ్మికుంటకు కేటాయించాలి
జమ్మికుంట: రాష్ట్రంలోని జమ్మికుంట పత్తి మార్కెట్‌ను పీబీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని జమ్మికుంట అడ్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షు డు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మా ర్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశంకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జమ్మికుంట వ్యవసాయ పత్తిమార్కెట్‌ను పీబీపీఎస్‌కు ఎంపిక చేయాలన్నారు. తద్వారా మార్కెట్‌లో పని చేసే వందలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి గౌడ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గుత్తి కుమార్ పాల్గొన్నారు.
● పీబీపీఎస్ అమలైతే సీసీఐ లేనట్లే
● ఇదే జరిగితే రైతులకు నష్టమే