
కూర బాగోలేదంటే తిడుతోంది
● కన్నీరు పెట్టుకున్న కేజీబీవీ విద్యార్థులు
● వంట మనిషిపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆగ్రహం
శంకరపట్నం: కూరలు రుచిగా లేవంటే వంట మనిషి తిడుతోందని కేజీబీవీ విద్యార్థులు ఎమ్మెల్యే ఎదుట కన్నీరుపెట్టుకున్నారు. దీంతో వంటమనిషి పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చే యాలని అధికారులను ఆదేశించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం శంకరపట్నం మండలం కేశవపట్నం కస్తూ రిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థినులతో కలిసి భోజనం చేశా రు. ప్రభుత్వం మీకోసం రూ.లక్షల ఖర్చు చేస్తోందని, ఆహారం ఎలా ఉంటోందని విద్యార్థులను ప్రశ్నించారు. ‘చపాతీలు మమ్మల్నే చేయమంటున్నారు. రెండోసారి కర్రీ వడ్డించడం లేదు. అడిగితే వంటమనిషి రేణుక తిడుతోంది. కూరలేకుండానే అన్నం తింటున్నాం’. అంటూ కంటతడి పెట్టారు. దీంతో ఎమ్మెల్యే వంటమనిషి రేణుకపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీ కో– ఆర్డినేటర్ కృపారాణికి ఫోన్‌చేసి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అనంత రం విద్యార్థులకు పాఠాలు బోధించారు. తహసీల్దా ర్ సురేఖ, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో ప్రభా కర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.