
వెసక్టమీ సులువైన పద్ధతి
కరీంనగర్‌టౌన్: కుటుంబ నియంత్రణకు వెసక్టమీ సులువైన పద్ధతని డీఎంహెచ్‌వో వెంకటరమణ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స క్యాంపును సందర్శించి మాట్లాడారు. వెసక్టమీతో ఎలాంటి ఇబ్బంది ఉండదని, వారం రోజులపాటు ఇచ్చిన సూచనలను పాటిస్తూ రెస్ట్ తీసుకుని మామూలు దైనందిన జీవితాన్ని కొనసాగించొచ్చని తెలిపారు. వెసక్టమీ ఆపరేషన్ జరిగిన కొన్ని నెలల వరకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ (కండోమ్ వాడటం) పద్ధతిని అవలంబించాలని పేర్కొన్నారు. దీని వల్ల ఇదివరకే ఆపరేషన్‌కు ముందు నిల్వ ఉన్న శుక్రకణాల వల్ల గర్భం రాకుండా ఉంటుందని, వెసక్టమీతో పురుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నా రు. క్యాంపులో డాక్టర్ మహమ్మద్ అలీం వెసక్టమీ ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. ఈనెల 17న జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆసుపత్రి హుజురాబాద్, సామాజిక ఆసుపత్రి జమ్మికుంటలో వెసక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్ ఉమాశ్రీ, సన జవేరియా పాల్గొన్నారు.