
పేదింటి బిడ్డకు బంగారు పతకం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పేదింటి బిడ్డను కాకతీయ యూనివర్సిటీ బంగారు పతకంతో సత్కరించింది. మండలం కేంద్రానికి చెందిన వొడ్నాల రాజయ్య– సరోజన దంపతుల ఏకై క కుమారుడు శివలింగం కాకతీయ యూనివర్సిటీలో ఎంకామ్ 2015–17 బ్యాచ్ (ఫైనాన్షియల్ అకౌంటెంట్)లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచాడు. ఇటీవల నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణ్‌దేవ్‌వర్మ, వైస్‌చాన్స్‌లర్ ప్రతాపరెడ్డి ద్వారా బంగారు పతకం అందుకున్నాడు. తల్లిదండ్రు లు కడుపేదరికంలోనివారు. అంతేకాదు.. శివలింగం చిన్న తనంలోనే ఆయన తండ్రి అనారోగ్యంతో చనిపోయా డు. తల్లి టైలరింగ్ చేస్తూ కుమారుడిని పోషించి చదివించింది. తన తల్లి ప్రోత్సాహం, ఉపాధ్యా యుల మార్గదర్శనంలో బంగారు పతకం సాధించానని శివలింగం తెలిపాడు. పేదకుటుంబం నుంచి వచ్చి న తాను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పేద, మధ్యతరగతి విద్యార్థులకు భోజనం అందజేస్తామని అన్నాడు.
తల్లి కష్టంతో చదువుకొని కేయూలో టాపర్‌గా నిలిచి..
ఎంకామ్‌లో విద్యార్థి ప్రతిభ

పేదింటి బిడ్డకు బంగారు పతకం