
జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) వైద్యు లు శనివారం అరుదైన దంత శస్త్ర చికిత్స చేశా రు. ముత్తారం మండలానికి చెందిన ఇనుముల ఉప్పలయ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తో శనివారం ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షించిన డెంటల్ వైద్యులు పలు పరీక్షలు చేశారు. లుడ్విగ్స్ ఆంజినా అనే అరుదైన సమస్యగా, వేగంగా ఇన్‌ఫెక్షన్ సోకుతుందని గుర్తించారు. పేషెంట్‌కు వెంటనే శస్త్రచికిత్స చేసి అర్ధ లీటరు వరకు చీము తొలగించారు. శస్త్రచికిత్సలో డాక్టర్లు శ్రవణ్, హెచ్‌వోడీ సుమలత, లహరి, నయన పాల్గొన్నారు. పేషెంట్‌కు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, సిమ్స్ ప్రిన్సిపాల్ హి మబింద్ సింగ్, ఆర్‌ఎంవో రాజు అభినందించారు.
అంగన్‌వాడీ టీచర్ మృతికి కారణమైన వ్యక్తి రిమాండ్
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ మాజోజ్ స్వరూప(52) మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాలు. అంగన్‌వాడీ టీచర్ స్వరూప సమీపంలోని తండాలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. ఈనెల 7న విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా అదే తండాకు చెందిన కొడావత్ నరేశ్ ఇంటి వద్ద దించుతానని బైక్‌పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో మద్దిమల్లకు కాకుండా గుండారం వైపు బైక్ మళ్లించాడు. భయాందోళనకు గురైన స్వరూప కేకలు వేసిన ఆపకపోవడంతో బైక్ పై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడ్డ స్వరూప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. మృతురాలి కొడుకు విష్ణుసాగర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతికి కారణమైన కొడావత్ నరేశ్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
రెండోసారి పట్టుబడిన జగదీశ్
కరీంనగర్‌క్రైం: కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగాధర వద్ద ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.90వేలు లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడిన పీఆర్ ఏఈ జగదీశ్.. గతంలో కూడా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జగదీశ్ లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం ఇది రెండోసారి. తొలిసారి 2017లో ఏఈ జగదీశ్ కరీంన గర్ పీఆర్ ఏఈగా పనిచేశారు. ఆ సమయంలో బొమ్మకల్‌కు చెందిన సీసీ రోడ్డు పనుల విషయంలో ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. శనివారం మళ్లీ రూ.90 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. గతంలో ఓసారి పట్టుబడినా ఆయన తీరుమారలేదు. ఇది ఇలా ఉండగా శనివారం సాయంత్రం వరకూ కరీంనగర్‌లోని భాగ్యనగర్‌లో గల జగదీశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జగదీశ్ బంధువులు, ఆయన ఆస్తులపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
పెద్దపల్లి పీఆర్ ఆఫీసులో తనిఖీలు
పెద్దపల్లిరూరల్: ఏఈ జగదీశ్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. ఆ తర్వాత పెద్దపల్లిలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయానికి చే రుకున్నారు. అక్కడ తనిఖీలు చేశారు. ఏసీడీ డీఎ స్పీ విజయ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. రాజు నుంచి లంచం తీసుకుంటుండగా జగదీశ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పెద్దపల్లిలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయానికి వచ్చామన్నారు.