
హత్య కేసులో నిందితుల అరెస్టు
ధర్మపురి: యువకుడిని హత్య చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు పంపినట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్ల డించారు. మండలంలోని దోనూర్‌కు చెందిన గొల్లన రవి, నాగరాజు అన్నదమ్ముల కొడుకులు. ఇరువురి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. కొంతకాలంగా గెట్టు విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రవికి ఇందిరమ్మ ఇల్లు రావడంతో నిర్మాణం చేపడుతున్నాడు. ఈనెల 10న రాత్రి ఇంటి స్థలం విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగగా నాగరాజు ఆయన తల్లిదండ్రులు అమ్మక్క, బక్కయ్య ప్రోత్సాహంతో రవిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. రవి కుమారుడు విష్ణు అడ్డుకునేందుకు యత్నించగా.. అతడిపైనా దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులు రవి, విష్ణును ఆస్పత్రికి తరలించారు. రవి అప్పటికే మృతి చెందినట్లు జగిత్యాల వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాగరాజు, అతడికి సహకరించిన అమ్మక్క, బక్కయ్యను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు ఉదయ్‌కుమార్, రవి కుమార్ ఉన్నారు.