
అట్టహాసంగా ఆల్ ఇండియా చెస్ పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో డెమొక్రటిక్ చెస్ ఫెడరేషన్ సహకారంతో వీ కన్వెన్షన్‌లో శనివారం 3వ ఆల్ ఇండియా జూనియర్, ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 600 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. నిర్వాహకులు స్విస్ లీగ్ పద్ధతిలో 8 రౌండ్ల వరకు పోటీలు ఏర్పాటు చేయగా, తొలిరోజున నాలుగురౌండ్ల వరకు నిర్వహించారు. అంతకుముందు పోటీలను జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి బి.శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాస్‌రెడ్డి, సంగం లక్ష్మణ్, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరీంనగర్ అంటేనే క్రీడాపోటీల నిర్వహణకు, క్రీడాకారులకు నిలయం అన్నారు. జాతీయస్థాయి చెస్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందని, నిర్వాహకులను అభినందించారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులందరూ విశ్వనాథన్ ఆనంద్, గుకేష్, ప్రజ్ఞానంద్, అర్జున్, కోనేరు హంపి లాంటివారిని స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలని సూచించారు. పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి రూ.లక్షకు పైగా నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు జీనియస్ అకాడమీ డైరెక్టర్ కోచ్ కంకటి అనూప్‌కుమార్ తెలిపా రు. అకాడమీ వ్యవస్థాపకుడు కంకటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
600 మందికి పైగా క్రీడాకారులు హాజరు

అట్టహాసంగా ఆల్ ఇండియా చెస్ పోటీలు