వామ్మో.. సెల్యులైటిస్‌ | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. సెల్యులైటిస్‌

Jul 9 2025 6:36 AM | Updated on Jul 9 2025 6:36 AM

వామ్మ

వామ్మో.. సెల్యులైటిస్‌

కరీంనగర్‌టౌన్‌: జిల్లా ప్రజలను సెల్యులైటిస్‌ వ్యాధి భయపెడుతోంది. గతేడాది ఇదే సీజన్‌లో ప్రారంభమైన ఈ వ్యాధి బాధితులను ప్రాణాపాయ స్థితివరకు తీసుకెళ్లింది. మళ్లీ ప్రస్తుత సీజన్‌లో విజృంభిస్తోంది. వందల సంఖ్యలో రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వర్షాకాలంలో వ్యాపించే ఈ వ్యాధి ఎన్నడూ లేనంతగా నెల రోజులుగా విజృంభిస్తోంది. సెల్యులైటిస్‌ సాధారణ బాక్టీరియల్‌ చర్మ ఇన్ఫెక్షనే అయినప్పటికీ వ్యాధి తీవ్రతతో ప్ర మాదకరంగా మారుతుంది. ఎక్కువగా కాళ్లపై కనిపిస్తుంది. చికిత్స నిర్లక్ష్యం చేస్తే అన్ని శరీర భాగా లకు సోకే ప్రమాదముంది. వ్యాధి వ్యాపిస్తే చర్మం ఎరుపు, వాపు, వెచ్చగా, నొప్పిగా ఉంటుంది. జ్వరం, వాపు, తీవ్రమైతే చర్మం మీద చీము వస్తుంది. పుండు, గాట్లు పడినప్పుడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. మెల్లగా రక్తనాళాల్లోనికి చేరుతుంది. ఒక దశలో ఇన్‌ఫెక్షన్‌ సోకిన అవయవాలను తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీర్ఘకాలిక చర్మవ్యాధులు, బోదకాలు, వెరికోస్‌వెయిన్స్‌, మధుమేహం, హెచ్‌ఐవీతో బాధపడేవారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

ఇవీ కారణాలు

బాక్టీరియా (స్టెఫిలోకాకస్‌, స్ట్రెప్టోకోకస్‌) చర్మంలోనికి పుండు లేదా పగుళ్ల ద్వారా ప్రవేశించినప్పుడు సెల్యులైటిస్‌ ఏర్పడుతుంది. ఇందులో రెండు దశలు ఉన్నాయి. ఇది ప్రారంభమైన తర్వాత శరీరంలోని ఏ భాగానికై నా వ్యాపించవచ్చు. చర్మం ఎర్రగా మారడం, ఉబ్బడం, దురుద, పుండుగా మారుతుంది. రెండోదశలో ఇన్ఫెక్షన్‌గా మారితే చీము వస్తుంది. జిల్లాలో దోమలు పెరగడంతో ఈ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పెద్ద ఎత్తున సెల్యులైటిస్‌ కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దోమ కాటుకు గురైన వ్యక్తులు ఆ ప్రాంతంలో దురదగా అనిపించి గోకడం ద్వారా గాట్లు, పుండు పడిన ప్రాంతం నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి సెల్యులైటిస్‌ సంభవిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమా దం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, గాట్లు, పుండు పడిన చోట మందులు వాడడం చేయాలి. మధుమేహం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల నుంచి రక్షణ పొందేందుకు నెట్‌, రిపెలెంట్స్‌ వాడా లి. కాళ్లు తడి కాకుండా కాపాడితే వ్యాధి సోకదు.

చికిత్స తీసుకోవాలి

సెల్యులైటిస్‌ ప్రమాదకరంగా మారుతోంది. దోమలు కుట్టి దురుద వచ్చిన ప్రాంతంలో గోకినప్పుడు, చర్మం మీద పగుళ్లు, పుండ్లు ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా చర్మం లోపలకు వెళ్లే అవకాశముంది. మధుమేహం ఉన్న రోగిలో సెల్యులైటిస్‌ గ్యాంగ్రీన్‌కు దారితీస్తుంది, ఇది ఒక అవయవాన్ని కోల్పోయేలా చేస్తుంది. ముఖ్యంగా కాళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. కాళ్లు ఉబ్బడం, నొప్పి, బొబ్బలు రావడం, జ్వరం వంటి సెల్యులైటిస్‌ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. లేని పక్షంలో ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తుంది.

– డాక్టర్‌ దిలీప్‌రెడ్డి,

సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ

వర్షాకాలంలో జాగ్రత్త

వర్షాకాలం ప్రారంభం కావడంతో తడి వాతావరణం, దోమలవ్యాప్తితో చర్మ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కాలంలో గాట్లు, పుండు పడిన చోట బాక్టీరియా (స్టెఫిలోకాకస్‌, స్ట్రెప్టోకోకస్‌) చర్మం లోపలకు ప్రవేశించి సెల్యులైటిస్‌ను కలిగిస్తుంది. మధుమేహం, హెచ్‌ఐవీ, బోదకాలు, వెరికోస్‌ వెయిన్స్‌ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఈ ఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తోంది.

– డాక్టర్‌ అబ్దుల్‌ వారిస్‌ ఉస్మాని (తాహా), జనరల్‌ అండ్‌ లాప్రొస్కోపిక్‌ సర్జన్‌

వామ్మో.. సెల్యులైటిస్‌1
1/2

వామ్మో.. సెల్యులైటిస్‌

వామ్మో.. సెల్యులైటిస్‌2
2/2

వామ్మో.. సెల్యులైటిస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement