స్థానిక సమరానికి బీజేపీ సై | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరానికి బీజేపీ సై

Jul 8 2025 7:37 AM | Updated on Jul 8 2025 7:37 AM

స్థాన

స్థానిక సమరానికి బీజేపీ సై

● కేంద్రమంత్రి బండి సంజయ్‌

ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చర్యలు లేవా?

గ్రామ ఽశివారులోని సర్వే నంబర్‌ 399లోని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఇదంతా జరిగింది. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించడమే కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఫిర్యాదు చేస్తే ఇప్పటికి చర్యలు లేవు. 27 నెలలుగా కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నా తీసుకుంటలేరు.

– ఆకుల రాజేశ్వర్‌రావు, గట్టుదుద్దెనపల్లి, మానకొండూరు

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు కమల దళం సై అంటోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ సోమవారం సాయంత్రం కరీంనగర్‌లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండలాధ్యక్షులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో వాతావారణం బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ హవా ఎంత ముఖ్యమో, పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థికి ఉన్న ఇమేజ్‌ కూడా అంతే ముఖ్యమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకని పంచాయతీ, మండల, మున్సిపాలిటీల పరిధిలో వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న నాయకులంతా పోటీలో ఉండాలని సూచించారు. మిగిలిన వారంతా పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా రెండు అంశాలను ప్రచారం చేయాలన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నిధులివ్వకుండా స్థానిక సంస్థలను ఏ విధంగా నీరుగార్చింది? అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులివ్వకుండా ద్రోహం చేసిందనే విషయంతో పాటు 19 నెలల కాంగ్రెస్‌ పాలనలో పంచాయతీలకు నిధులివ్వకుండా, కనీస అభివృద్ధి పనులు చేయకుండా ఏ విధంగా నష్టం చేకూరుస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు సహా శ్మశానవాటికల నిర్మాణం వరకు కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించారనే విషయాన్ని ఇంటింటికీ, గల్లీగల్లీకి తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో విజయాలు సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, పార్లమెంట్‌కన్వీనర్‌ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సమరానికి బీజేపీ సై1
1/1

స్థానిక సమరానికి బీజేపీ సై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement