
పదిగంటల జీవో సంగతి తేల్చాలి
జ్యోతినగర్(రామగుండం): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ పది గంటల జీవో విడుదల సంగతిని తెలియజేయాలని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద మాట్లాడారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించకుండా పది గంటల జీవో ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానంపై జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీవో కాపీలను దహ నం చేశారు. నాయకులు రెడపాక లక్ష్మణ్, పుల్లూరి నాగభూషణం, రాజమల్లయ్య, చింతల సత్యం, దగ్గుల సత్యం, కడారి సునీల్, సీహెచ్.ఉపేందర్, తోకల రమేశ్, కె.విశ్వనాథ్, ముద్దసాని దామోదర్‌రెడ్డి, జయసింహ తదితరులు పాల్గొన్నారు.