
ఇసుక టిప్పర్ పట్టివేత
వేములవాడఅర్బన్: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకుని వేములవాడ ఆర్టీసీ బస్సు డిపోకు తరలించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. నాంపల్లి శివారులోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై బుధవారం తనిఖీలు చేస్తుండగా టిప్పర్ నంబర్‌ప్లేట్ మార్చి ఇసుక తరలిస్తున్న వాహనం పట్టుబడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని వీణవంక మండలం కొండపాక ఇసుక రీచ్ నుంచి టీజీ 23 టీ 1225పై అనుమతి ఉంది. పోలీసుల తనిఖీల్లో టిప్పర్ నంబర్, ఇంజన్ చాసిస్ నంబర్‌కు తేడా ఉన్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇసుక అక్రమ రవాణా జరుగగా పోలీసు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు.