
విద్యుత్ ఉద్యోగుల నిరసన
కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వరంగ సంస్థలతోపాటు విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం కరీంనగర్‌లోని టీజీఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు ని రసన తెలిపారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలతోపాటు విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్నారు. కొంతకాలంగా ఉత్తరప్రదేశ్‌లోని రెండు డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను ప్రైవేట్‌పరం చేయడానికి నిర్ణ యం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించా రు. జేఏసీ నాయకులు ఎన్.అంజయ్య, సీహెచ్.భాస్కర్, కె.శ్రీనివాస్, సీహెచ్.సంపత్‌కుమార్, ఎం.రమేశ్, వి.కిరణ్‌కుమార్, జి.శ్రీనివాస్, సంతోష్, ఆకుల వీరయ్య, శ్యామయ్య, రఘు, శ్రీనివాస్, కె.రాజు, షరీఫ్, మల్లేశం, సంపత్, మోయిన్‌పాషా, శ్రీమతి పాల్గొన్నారు.
ప్రైవేటీకరించొద్దని డిమాండ్