
ధర్నాలో పాల్గొని.. తిరుగు ప్రయాణంలో గుండెపోటుకు గురై..
ధర్మారం(ధర్మపురి): దొంగతుర్తి గ్రామ పంచాయతీ పంప్ ఆ పరేటర్, పంచాయతీ అసోసియేషన్ మండల అధ్యక్షుడు ఆ కుల రాజయ్య(52) బుధవారం గుండెపోటుతో హ ఠాన్మరణం చెందారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ధర్మారం తహసీల్దార్ కార్యాల యం ఎదుట పంచా యతీ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజయ్య ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. అనంతరం తన ఇంటికి వెళ్లేందుకు కార్మికులతో కలిసి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ వెంటనే తన శరీరం అదుపు తప్పుతుందని చెప్పడంతో తోటికార్మికుడు రాగుల మల్లేశం బైక్‌పై ఆస్పతికి త రలిస్తుండగా మార్గమధ్యంలోనే కిందపడిపోయా రు. గమనించిన లయన్స్‌క్లబ్ మాజీ అధ్యక్షుడు తల మక్కి రవీందర్‌శెట్టి వెంటనే డాక్టర్‌ను పిలిపించి ప రీక్షించగా గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు. ఆ వైద్యుడు సీపీఆర్ చేశాక అంబులెన్స్‌లో కరీంనగ ర్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. రాజయ్య మృతితో కార్మికుల్లో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
పంచాయతీ కార్మిక సంఘం నేత మృతి