
విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
కరీంనగర్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు పర్మిషన్‌లు ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారని, ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నా వి ద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నా రు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షులు అంగిడి దేవేందర్, జీవన్, తాత్విక్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.