
పోలీసుల ప్రతిభ గుర్తించడానికే పోటీలు
● సీపీ గౌస్ ఆలం ● పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభం
కరీంనగర్‌క్రైం: పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంచడం కోసం పోలీసు డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. సోమవారం కమి షనరేట్ కేంద్రంగా రాజన్న జోన్–3 స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేర దర్యాప్తులో మరింత శాసీ్త్రయత కోసం డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్, విజయ్ కుమార్, వాసాల సతీశ్, వేణుగోపాల్, యాదగిరి స్వామి, రంగనాయక్ తదితరులు పాల్గొన్నారు.