
రాజన్నకు మొక్కులు
వేములవాడ: రాజన్నను సోమవారం 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ముసురును సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో రాధాబాయి, ఏఈవోలు శ్రీనివాస్, శ్రవణ్, అశోక్, జయకుమారి, పర్యవేక్షకులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు.
25 రోజుల్లో రూ.2 కోట్ల ఆదాయం
రాజన్నకు 25 రోజుల్లో హుండీల ద్వారా రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈవో రాధాబాయి తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య సోమవారం హుండీలలోని కట్నాలు, కానులను ఆలయ అధికారులు, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు లెక్కించారు. రూ.1,99,84,960 నగదు, మిశ్రమ బంగారం 188 గ్రాములు, మిశ్రమ వెండి 14.300 కిలోలు సమకూరినట్లు ఈవో తెలిపారు. ఆలయ ఎస్పీఎఫ్ ఏఎస్సై మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.